అంగాంగాల కొలతలతో రాదు అందం
అవయువాల వంపుసొంపులలో లేదు అందం
వయసు బిగువుతో వచ్చేది కాదు అందం
బాహ్యలంకరనలతో రాదు అందం
నవమాసాలు మోసి జన్మ నిచ్చే తల్లిలో ఉంది అందం
పాపాయి బోసి నవ్వులలో ఉంది అందం
అందాన్ని కాదని శిశువుకు పాలనిచ్చే తల్లిలో ఉంది అందం
కరిగిపోతూ వెలుగునిచ్చే కొవ్వొత్తిలో ఉంది అందం
త్యాగమూర్తుల త్యాగఫలం లో ఉంది అందం
అల్లూరి,భగత్ సింగ్ ల సౌర్యం లో ఉంది అందం
గాంధీ అహింసా వ్రతం లో ఉంది అందం
ప్రాణాలొడ్డి దేశాన్నిరక్షించే వీర సైనికుడిలో ఉంది అందం
జీసస్ , బుద్దుల కరుణామృత ధారలలో ఉంది అందం
మానత్వాన్ని పంచేది అసలైన అందం
వయసు పెరిగితే తరిగేది అందం
నిస్వార్థ సేవలో ప్రతిఫలించేది అందం
keka guruvugaru mee kavita chaala challa bagundi
ReplyDelete