పుస్తకం మస్తిష్క భాండాగారం
తొలగించు అజ్ఞాన తిమిరం
వెలిగించు విజ్ఞాన దీపం
అక్రమ మార్గం లో పయనించే మనసును
సక్రమ మార్గం లో పెట్టే సాధనం
వెర్రిమొర్రి ఆలోచనలకు అడ్డుకట్టవేసే
ఆధునిక రిమోట్ కంట్రోల్ఈ పుస్తకం
భూత భవిష్యత్ వర్తమాన కాల జ్ఞానం
పరిశోధకులకు జిజ్ఞాసువులకు భాండాగారం
మనసును మదించి శోధించే సాధనం
విజ్ఞానపు బావుటా ఎగురవేసే జ్ఞాన శక్తి
కృషి చేస్తే పరివర్తన చాటే శ్రమ శక్తి
సత్య శోధనతో నగ్న సత్యాలను
వెలికి తెచ్చే ఆయుధం
సమస్యల పరిష్కారం లో ఉత్తమ నేస్తం
సమ సమాజ నవ సమాజ
నిర్మాణపు రద సారధి
No comments:
Post a Comment