అడక్కు తింటున్నావు సిగ్గులేదు
బిచ్చాగాడ్ని కసిరిందో ఇల్లాలు
దానికి బిచ్చగాడి సమాధానం
తల్లీ, నువ్వు ఈ దేశంలో పుట్టావ,
విదేశాలనుంచి వచ్చావ?
చరిత్రపుటలను తిరగెయ్యి
గత వైభవాలను గుర్తుతెచ్చుకో
తెలుస్తుంది ఈ లోకంలో అడక్క తినే వారెవరో
భారత,భాగవతలన్నింటి లోను
అడక్క తినటమే కదా మూలం
వామనుడు మూడు అడుగుల నేలనిమ్మని
బలిచక్రవర్తిని అడుక్కున్నాడు
బంగారు కొండమీది ఇంద్రుడు
తనయుడి కోసం కవచకుండలాలు అడుక్కున్నాడు
కురుక్షేత్రంలో కుంతి కర్ణుడిని
ధర్మ రాజు భీష్మున్ని అడుక్కున్నారు
రాష్ట్రం కేంద్రాన్ని,కేంద్రం ప్రపంచాన్ని అడుక్కుంటుంది
పెద్ద దేశాలు చిన్న దేశాన్ని అడుక్కుంటున్నాయి
వాళ్ళకి లేని సిగ్గు నాకెందుకు ?
దేశాన్ని దోచుకు తినేవాడికి ఉండాలి
తల్లిదండ్రుల్ని గౌరవించని వారికుండాలి
డబ్బు కోసం గడ్డి తినేవాడికుండాలి
చెలికి, చెల్లికి తేడా తెలియని వాడికుండాలి
వాళ్ళకు లేని సిగ్గు నాకెందుకు ?