Tuesday, 25 October 2011

నగ్న సత్యం



నేను పుట్టగానే ఏడ్చానట 
దిక్కులు పిక్కటిల్లేలా 
కప్పులు ఎగిరిపోయేలా
ఎవరి బాగు చూసి ఏడుస్తున్నావు 
పుట్టగానే ఏడుపు మొదలెట్టావు
అని అందరు ఈసడించుకున్నారు 
మా అమ్మ కూడా నన్ను ఏడుపుగొట్టు మొహం అంది
అయిన నాకొక చిన్న అనుమానం 
పుట్టగానే ఏడ్చింది నేనేనా 
ఇంకెవరు ఏడవలేద ?
మా అమ్మ పుట్టినప్పుడు ఏడవలేద 
అమెది నవ్వుగొట్టు మొహమా ?
గురివిందకే తెలియాలి ఈ నగ్న సత్యం.

No comments:

Post a Comment