ఆస నిరాసల సమ్మిళితం
చీకటి వెలుగుల మిశ్రమం
తెలుసుకో ఇది జీవితం
కానే కాదిది శాశ్వతం
మలుచుకో దానిని ఉన్నతం
వలపు లేనిది వగపు లేదు
ఆశ లేనిదే నిరాశ లేదు
కష్టలెన్నో ఎదురైనా
కన్నీరే ఏరై పారినా
ఆశల సౌధం కూలినా
నిరాసల సౌధం లేచినా
క్షణమొక యుగమైనా
బ్రతుకే నరకమైనా
మదిలో తుఫాను రెగినా
శాంతి కోసమే తపించు
ప్రశాంతినే అభిలాషించు
ఆత్మతృప్తితో జీవించు
సుఖ జీవితం లభించు.
No comments:
Post a Comment