బ్రతుకే ఓ పుస్తకం
అందులో పేజీలే ఆయిష్షు
అక్షరాలే ఆలోచనలు
ఆలోచనలే అంతరంగాలు
అంతరంగాలే అనుభూతులు
అనుభూతులే అంతః కరణలు
పంక్తులే ప్రవర్తనలు
పేరాగ్రాఫ్ లే జీవిత మజిలీలు
పేజీలను కలిపే బంధం సూత్రం
అధ్యాయాలే జీవిత ఘట్టాలు
ప్రముఖుల అభిప్రాయాలే శీలం
పుస్తకాన్ని పూర్తిగా చదవటమంటే
జీవితాన్ని పూర్తి గా అనుభవిన్చినట్ట్లే
No comments:
Post a Comment