Monday, 24 October 2011

నిహారిక





మధుకర మంజుల రసగాత్రి
మృదుమోహనమౌ  సుమనేత్రి 
పాలవెల్లికి సోయగమే నీవు
కదలివచ్చిన శైకత శిఖరం 
తరలివచ్చిన బృందావనివే 
తొలి తొలకరి చల్లని  చినుకువై
మబ్బుల మాటున మెరుపువై
చీకటి ముసిరినా వెన్నెలవై
కదలి వచ్చిన కళ్యాణి నీవు
తరలివచ్చిన సుమమే నీవు
శృంగార మంజుష మందాకినీ 
హిమలికవో నీవు నిహరికవో 
నీలాల గగనాల పరువంపు బాల
అనురాగ రసమయ నవకోమల.
   


No comments:

Post a Comment