భరత జాతి - దమన నీతి
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది
కొత్త కష్టాలు ప్రజలకు కొని తెచ్చింది
నిత్యావసరవస్తువుల ధరలు ఆకాశంలోకి
సామాన్యుడి బ్రతుకు నడి బజార్లోకి
కులాల కుమ్ములాటలతో మతం మత్తుతో
దేశం అంతా తగలబడి పోతున్నది
బుద్దుడు పుట్టిన పుణ్యభూమి
దారుణ హత్యలతో దద్దరిల్లుతోంది
సంచులతో సొమ్ములు, చేతుల్లో సరుకులు
ఇదే సామాన్యుడి బ్రతుకుబాట (చిత్రం)
పరువు ప్రతిష్టలనే ఇరుసు చక్రంలో
నలిగి నురుగులు కక్కుతున్నాడు
దింపుడు కళ్ళం ఆశతో బ్రతుకుతున్నాడు .
విద్య వ్యాపార మాయమైంది
ప్రతిభకు సమాధి కట్టింది
లంబ కోణాలతో కుంభకోణాలతో
ప్రజానాయకుల చేతుల్లో ప్రజాస్వామ్యం విలవిలలాడుతుంది
భారతమాత పరువనే శీలాన్ని
నడిబజార్లో అమ్మే తనయులున్నంత కాలం
జాతికి విముక్తి లేదు
ఈస్తితిలో స్వాతంత్ర్యం వచ్చిన రాకున్న వక్కటే.
[ జిల్లా స్తాయి కవితలపోటిలో ప్రధమ బహుమతి పొందిన కవిత ]
No comments:
Post a Comment