కవిత కోరేది నవత
సాధించాలి సమతా మమత
ప్రతిబింబించాలి వాస్తవికత
తొలగించాలి సమాజ రుగ్మత
కవిత్వం ఎక్కడో పుట్టదు !
సామాన్యుడి గుండెల్లో
బండబారిన బ్రతుకుల్లో
కర్షకుని హలంలో
కార్మికుని స్వేదజలంలో
పుడుతుంది కవిత్వం.
[కెరటాలు శీర్షికన విజయవాడ కేంద్రం నుండి ప్రసారం ]
No comments:
Post a Comment