జీవిత నౌకలో పయనించు జీవుడా
సుఖ దుఖాలకతీతుడవు కాలేవు
దుఖం వెనుకే సుఖముంటుందని
ఆశ లేనిదే ఆవేదన లేదని
ప్రేమ లేనిదే ఆరాధన లేదని గ్రహించు
జీవితంలో పెనుచీకటి కమ్మిందని
సుడిగాలులు చెలరేగినవని
భయపడకు,భాద పడకు
జీవితం సుఖ దుఖాల మిశ్రమం
ఆలోచనలతో ఆవేదన పొంది
విలువైన కాలాన్ని వ్యర్థం చేయకు
భవిష్యత్ కై పోరాటం సాగించు
కష్టాల కడలినే అధిగామించు
No comments:
Post a Comment