బోసి నవ్వుల పాపాయి
బుజి బుజి నడకల పాపాయి
గల గల పారే సెలయేరులా
తల తల మెరిసే తారకలా
కల కల కిల కిల నవ్వేవు
కష్టాలను మరిపించేవు
ఉంగా ఉంగా అంటావు
బుంగ మూతినే పెడతావు
దొంగ చూపులే చూస్తావు
దొర నవ్వులే నవ్వేవు
వద్దంటే రాక మానవు
ముద్దంటే ఈక మానవు
No comments:
Post a Comment